icon icon icon
icon icon icon

‘జగన్‌ అండ్‌ కో’తో సినిమా తీస్తే ఆస్కార్‌ గ్యారెంటీ: లోకేశ్‌

‘ఏపీ సీఎం జగన్‌ అండ్‌ కో’తో సినిమా తీస్తే ఆస్కార్‌ అవార్డు గ్యారంటీ అని మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. స్పెషల్‌ గులకరాయి తగిలి సీఎం జగన్‌ నుదిటిపై ఏర్పడిన గాయం.. బస్సు యాత్ర ముగియగానే ఎలా మాయమైపోయిందని, ఇలాంటి డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.

Published : 29 Apr 2024 06:50 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: ‘ఏపీ సీఎం జగన్‌ అండ్‌ కో’తో సినిమా తీస్తే ఆస్కార్‌ అవార్డు గ్యారంటీ అని మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. స్పెషల్‌ గులకరాయి తగిలి సీఎం జగన్‌ నుదిటిపై ఏర్పడిన గాయం.. బస్సు యాత్ర ముగియగానే ఎలా మాయమైపోయిందని, ఇలాంటి డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఆదివారం ఉదయం ‘రచ్చబండ’ నిర్వహించారు.  ప్రజల బిడ్డనంటూ పదేపదే చెప్పే జగన్‌.. ఇప్పుడు వారి భూములు కొట్టేసేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో కొత్త పథకానికి తెరతీశారని విమర్శించారు. ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అసలు వారి వద్ద ఉంచుకొని.. నకళ్లు యజమానులకు ఇస్తామంటున్నారని, ఏమరుపాటుగా ఉంటే మొత్తం ఆస్తినే కాజేస్తారన్నారు. అధికారంలోకి రాగానే ఐదు కోట్ల ఆంధ్రులు తలెత్తుకునేలా రాజధానిని పూర్తి చేస్తామన్నారు. తెలుగు వాళ్లు చాలా మంది ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని, వారందరికీ మన రాష్ట్రంలో అవకాశాలు సృష్టిస్తామన్నారు. చంద్రబాబు విజనరీ అయితే.. జగన్‌ ప్రిజనరీ అని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img