icon icon icon
icon icon icon

ఇక్కడ మేనేజ్‌ చేసుకున్నా.. అక్కడ శిక్ష తప్పదు: వివేకా హత్యపై బ్రదర్‌ అనిల్‌ వ్యాఖ్యలు

‘దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. న్యాయం పక్షాన ఉంటాడు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేం. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారు.

Updated : 30 Apr 2024 07:08 IST

ఈనాడు, కడప: ‘దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. న్యాయం పక్షాన ఉంటాడు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేం. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారు. ఎవరేం చేసినా వాస్తవమేంటో మనసుకు, మనిషికి తెలుసు. అన్యాయం చేసిన వారికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్‌ చేసుకున్నా, అక్కడ దేవుడి సన్నిధిలో శిక్ష తప్పద’ని షర్మిల భర్త, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఈ నర్మగర్భ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. వైయస్‌ఆర్‌ జిల్లాలో వివేకా హత్య చుట్టూనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ కుటుంబం రెండుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటోంది. ఈ తరుణంలో వివేకా హత్య జరిగిన ఐదేళ్ల తర్వాత తొలిసారి బహిరంగంగా స్పందించిన అనిల్‌.. ‘వివేకా మంచి నాయకుడు. ఆయన హత్య చాలా బాధాకరం. అంతిమ విజయం న్యాయానికే దక్కుతుంద’ని అభిప్రాయపడ్డారు. రాజు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారని, మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు. ‘పాలకులు డబ్బు వ్యామోహంతో కక్కుర్తి పడొద్దు. నేనెప్పుడూ ఒక వ్యక్తికి ఓటు వేయాలని దేవుడిని అడగను. షర్మిలకు ఓటు వేయాలని కూడా కోరడం లేదు. నా కమ్యూనిటీ తరఫున నిలబడతాను’ అని అనిల్‌ స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img