icon icon icon
icon icon icon

బహుమతులిచ్చి ఉద్యోగుల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం

వైకాపా వాళ్లు కూపన్‌లు, బహుమతులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 03 May 2024 05:35 IST

పోస్టల్‌ బ్యాలట్‌తో వైకాపాకు బుద్ధి చెప్పాలి
తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా వాళ్లు కూపన్‌లు, బహుమతులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని అన్ని విధాలుగా మోసం చేసిన సీఎం జగన్‌ మాయలో మళ్లీ పడొద్దని వారిని హెచ్చరించారు.  పోస్టల్‌ బ్యాలట్‌తో అధికార పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పరోక్షంగా ఎన్నికల విధుల్లో ఉండే డ్రైవర్లు, ఇతర సిబ్బందికి పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు కల్పించాలని కోరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని లిక్కర్‌ షాపుల దగ్గర కాపలా ఉంచింది. వారితో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తూ..అవమానిస్తోంది. డీఏ బకాయిలు ఇవ్వకుండా వేధిస్తోంది. ఏ నెలా ఒకటో తేదీన జీతం ఇవ్వలేదు. వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని మోసం చేశారు’’ అని అశోక్‌బాబు మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేసిన రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసి..ఉద్యోగులతో చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. 2019 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు తిరస్కరణకు గురవ్వడంపై అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img