icon icon icon
icon icon icon

ఓట్లేయలేం.. మీ నోట్లు మాకొద్దు: వైకాపాకు ఉద్యోగుల షాక్‌

ప్రకాశం జిల్లాలో అధికార వైకాపాకు ఉద్యోగులు షాకిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రలోభాల వల విసురుతున్నారు.

Updated : 06 May 2024 12:50 IST

తెదేపా ప్రచారానికి విరాళం అందజేత  

ఒంగోలు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లాలో అధికార వైకాపాకు ఉద్యోగులు షాకిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రలోభాల వల విసురుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వార్డులు, డివిజన్ల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించి పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నారు. గత అయిదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలతో ఇబ్బందులు పడిన ఉద్యోగులు మాత్రం వారికి ఓటేసేందుకు ససేమిరా అంటున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరం సహా ఇతర నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించారు. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయినా ఉద్యోగ, ఉపాధ్యాయులు తిరస్కరిస్తున్నారు. ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం పాఠశాల వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ఒక మహిళా ఉద్యోగిని ఓటు వేసేందుకు వెళ్తుండగా.. సమీపంలో ఉన్న వైకాపా నాయకులు ఆమెను ఓటు అభ్యర్థిస్తూ రూ.5 వేలు ఇవ్వబోయారు. ఆ మొత్తాన్ని తిరస్కరించిన ఆమె నేరుగా తెదేపా శిబిరం వద్దకు వచ్చి రూ.పది వేలు అందజేస్తూ ‘ఈ ఎన్నికల్లో ఖర్చులకు వాడండి.. ఇది మీ పార్టీకి నా విరాళం’ అని చెప్పారు. దీంతో వైకాపా నాయకులు కంగుతిన్నారు. అయిదేళ్లూ ఈ ప్రభుత్వాన్ని భరించాం, మరోసారి వైకాపాకు ఓటు వేస్తే మాపై మేం వేటు వేసుకున్నట్లేనని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img