icon icon icon
icon icon icon

వైకాపా వీరవిధేయ పోలీసులపై వేటు

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ముకాసిన పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) వేటు వేసింది. మాచర్ల టౌన్‌ సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వి.శ్రీహరిలను బదిలీ చేసింది.

Updated : 09 May 2024 09:20 IST

మాచర్లలో ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై బదిలీ
ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం కన్నెర్ర

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ముకాసిన పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) వేటు వేసింది. మాచర్ల టౌన్‌ సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వి.శ్రీహరిలను బదిలీ చేసింది. ఠాణాల్లో ఎస్సైలు, సీఐల ప్రోత్సాహంతోనే మాచర్లలో వైకాపా అల్లరిమూక చెలరేగిపోతోందని తెదేపా నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలస్యంగానైనా ఈసీ స్పందించి వారిపై వేటు వేసింది.

  • కారంపూడి సీఐ చినమల్లయ్య మార్చి 26న కారంపూడిలో ఓ టీ స్టాల్‌ వద్ద టీ తాగుతున్న తెదేపా కార్యకర్తలను పిస్తోలు చూపించి బెదిరించారు. ఇక్కణ్నుంచి వెళ్లకపోతే కాల్చిపడేస్తా అంటూ రెచ్చిపోయారు. 2021లో పురపాలక ఎన్నికల వేళ వినుకొండ సీఐగా ఉన్నప్పుడు.. దొంగ ఓట్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసిన బీఎస్పీ నాయకుడు రాజు, సీపీఐ నాయకుడు చిన్న పోదాల శీనుపైనే ఎదురుదాడికి దిగడం పెద్దవివాదానికి దారితీసింది.
  • మాచర్ల పట్టణంలో తెదేపా శ్రేణులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నా టౌన్‌ సీఐ శరత్‌బాబు చర్యలు తీసుకోలేదు. తెదేపా కార్యకర్త ఇర్ల సురేష్‌ కారును వైకాపా మూకలు తగలబెట్టినా, ఇటీవల 13వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడికి దిగినా ఆయన స్పందించలేదు.
  • వెల్దుర్తి ఎస్సై శ్రీహరి తెదేపా సానుభూతిపరులపై కేసులు పెట్టి, ఠాణాకు పిలిచి వేధించేవారనేది ప్రధాన ఆరోపణ. పార్టీ మారతావా లేదా అంటూ.. తెదేపా సానుభూతిపరుడైన మత్స్యకారుడు దుర్గారావును సంబంధం లేని కేసులో ఇరికించి హింసించడం, చివరకు అతను ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img