icon icon icon
icon icon icon

ప్రచారానికి వెళ్లిన వారికి నకిలీ నోట్ల పంపిణీ

ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజు కూలీలకు.. నాయకులు నకిలీ నోట్లు పంపిణీ చేసిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో బుధవారం వెలుగుచూసింది. ‘ఓ ప్రధాన పార్టీ నాయకులు రూ. 200 కూలి ఇస్తామంటే ప్రచారానికి వెళ్లాం.

Updated : 09 May 2024 07:35 IST

నందికొట్కూరు, న్యూస్‌టుడే: ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజు కూలీలకు.. నాయకులు నకిలీ నోట్లు పంపిణీ చేసిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో బుధవారం వెలుగుచూసింది. ‘ఓ ప్రధాన పార్టీ నాయకులు రూ. 200 కూలి ఇస్తామంటే ప్రచారానికి వెళ్లాం. ప్రచారం ముగిశాక వారు రూ.100 నోట్లు ఇచ్చారు. ఇంటికెళ్లి చూసుకోగా అవి దొంగనోట్లని తేలింది. డబ్బులిచ్చిన నాయకుడిని అడిగితే తాము అసలు నోట్లే ఇచ్చామని గద్దించి మాట్లాడుతున్నారు’ అని ప్రచారంలో పాల్గొన్న కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి నకిలీ నోట్లని తెలియక దుకాణాల్లో ఇవ్వగా వారు తమను తిట్టి పంపుతున్నారని మరికొందరు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img