icon icon icon
icon icon icon

ఏపీలో ఆదివారం బ్యాంకులు పనిచేసేలా చూడండి: చర్చనీయాంశమైన ఆర్థికశాఖ అధికారుల లేఖ

ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలు పనిచేసేలా చూడాలని ఆర్థికశాఖ అధికారులు డీజీఎంకు లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది.

Updated : 09 May 2024 08:19 IST

అమరావతి: ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలు పనిచేసేలా చూడాలని ఆర్థికశాఖ అధికారులు డీజీఎంకు లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది. మద్యం డబ్బులు డిపాజిట్‌ చేయడానికి అన్న కారణంతో ఆ బ్రాంచిలు తెరిచి ఉంచాలని లేఖ రాశారు. రాష్ట్రంలో రెండో శనివారం బ్యాంకులకు సెలవు. తిరిగి సోమవారం ఎన్నికలు ఉన్నందున ఆ రోజు కూడా సెలవు దినమే. ఈ నేపథ్యంలో శుక్రవారం, శనివారాల నాటి మద్యం అమ్మకాల డబ్బులను బ్యాంకుల్లో జమచేసేందుకు వీలుగా ఈ బ్రాంచిలన్నీ తెరిచి ఉంచాలని ఆర్థికశాఖ అధికారులు కోరారు. ఆ రోజు రూ.200 కోట్ల వరకు జమచేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. గతంలో సెలవులప్పుడు ఇలాంటి ఏర్పాట్లు చేసిన దాఖలాల్లేవు. ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img