icon icon icon
icon icon icon

చీరాల డీఎస్పీని చెట్టుకు కట్టేస్తాం.. చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి ఆగ్రహం

బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌... ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెడితే చెట్టుకు కట్టేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు.

Updated : 10 May 2024 07:55 IST

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌... ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెడితే చెట్టుకు కట్టేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. ఎమ్మెల్యే కరణం బలరాం అనుచరుడిగా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కఠారిపాలెంలో తనకు మద్దతు ఇస్తున్న మత్స్యకారుల ఇళ్లలో అవసరం లేకపోయినా కార్డన్‌సెర్చ్‌ నిర్వహించి వారిని భయాందోళనలకు గురి చేశారని ఆరోపించారు. ఈ మేరకు బాపట్ల కలెక్టరేట్‌కు వచ్చి.. ఎన్నికల పరిశీలకుడు పరిమళసింగ్‌, పోలీసు పరిశీలకుడు అయ్యప్పలకు ఆమంచి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయటానికే ప్రసాద్‌కు ఎమ్మెల్యే కరణం చీరాలలో పోస్టింగ్‌ ఇప్పించారని ఆరోపించారు. గత ఎన్నికలప్పుడు చీరాలలో సీఐగా ఉన్న ప్రసాద్‌... కరణం బలరాంకు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. ‘కఠారిపాలేనికి చెందిన వెంకటేశ్వర్లు పొలం విక్రయించగా కొనుగోలుదారులు రూ.25 లక్షల నగదును చీరాల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో జమచేశారు. వెంకటేశ్వర్లు విడతల వారీగా నగదు డ్రా చేసుకుని ఇంట్లో ఉంచుకున్నారు. వైకాపా అభ్యర్థి కరణం వెంకటేశ్‌కు కాకుండా కఠారిపాలెం వాసులు తనకు మద్దతు ఇస్తున్నారన్న కక్షతో డీఎస్పీని కార్డన్‌సెర్చ్‌కు పంపి భయభ్రాంతులకు గురి చేశారు’ అని ఆమంచి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img