icon icon icon
icon icon icon

మోదీ నాయకత్వాన్ని ప్రపంచమంతా కోరుకుంటోంది

దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో తీసుకెళ్తున్న మోదీ నాయకత్వాన్ని యావత్‌ ప్రపంచం కోరుకుంటోందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ అన్నారు.

Updated : 26 Apr 2024 05:17 IST

ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ
నిజామాబాద్‌ భాజపా అభ్యర్థిగా అర్వింద్‌ నామినేషన్‌

ఈనాడు, నిజామాబాద్‌: దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో తీసుకెళ్తున్న మోదీ నాయకత్వాన్ని యావత్‌ ప్రపంచం కోరుకుంటోందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ అన్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి గురువారం ముఖ్యఅతిథిగా హాజరైన పుష్కర్‌సింగ్‌ అనంతరం పాత కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో సీఏఏ అమలు.. కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసిన ధైర్యశాలి మోదీ అని అన్నారు. దేశంలో పౌరులందరికీ సమన్యాయం కోసం ఒకే చట్టం ఉండేలా యూనిఫాం సివిల్‌ కోడ్‌ను ప్రతిపాదించినట్లు చెప్పారు. ప్రజలంతా భాజపాకు ఓటు వేసి, మోదీకి అండగా నిలిచి దేశ ప్రగతికి తోడ్పాటునందించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం లౌకికవాద జపం చేస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహించిన ఆ పార్టీ.. మైనార్టీల ఓట్ల కోసం తన మ్యానిఫెస్టో రూపొందించిందన్నారు. రాష్ట్రంలో అహంకారంతో పాలన సాగించిన భారాసను, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఓడించాలని కోరారు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డి దోషిగా రుజువు కావడం ఖాయమని, దీంతో జులైలో ఆయన రాజీనామా చేస్తారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని అర్వింద్‌ అన్నారు. గాంధీభవన్‌లో.. భాజపా పాలనపై రేవంత్‌ ఛార్జిషీట్‌ విడుదల చేయడంపై ఆయన స్పందించారు. ఓటుకు నోటు కేసులో దోషిగా తేలుతాననే ఆందోళనతో రేవంత్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img