icon icon icon
icon icon icon

పులివెందుల సీఐ శంకర్‌రెడ్డితో ప్రాణహాని

వైఎస్సాఆర్‌ జిల్లా పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి.. వైకాపా నేతలతో చేతులు కలిపి తనను చంపేందుకు కుట్ర పన్నారని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 09 May 2024 07:12 IST

వివేకా కేసులో అప్రూవర్‌ దస్తగిరి ఫిర్యాదు

ఈనాడు, కడప: వైఎస్సాఆర్‌ జిల్లా పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి.. వైకాపా నేతలతో చేతులు కలిపి తనను చంపేందుకు కుట్ర పన్నారని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. తన హత్యకు జరుగుతున్న ప్రయత్నాలు.. ఆధారాలతో సహా తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి(ఈసీ) ఆయన బుధవారం ఫిర్యాదు చేశారు. ఇదే అంశాన్ని సీబీఐతో పాటు హైకోర్టు న్యాయమూర్తికి కూడా లేఖలు పంపినట్లు అందులో వివరించారు. జై భీమ్‌రావు పార్టీ తరఫున పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దస్తగిరి ప్రచార రథంపై మూడు రోజుల కిందట వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ శంకర్‌రెడ్డి హస్తముందని దస్తగిరి ఆరోపించారు. ఘటనపై ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకుండా వైకాపా నాయకులు చెప్పినట్లు వింటూ సీఐ అరాచకాలకు పాల్పడుతున్నారని వివరించారు. తన ప్రచార వాహనంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా తనకే 41-ఏ నోటీసు ఇచ్చారని ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిపై మీడియా సమావేశంలో దస్తగిరి ఆరోపణలు చేశారనే కారణాన్ని పేర్కొంటూ ఆయనకు 41-ఏ నోటీసు అందజేశారు. ఎప్పుడు పిలిచిన వెంటనే విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img