icon icon icon
icon icon icon

కామినేనిని భారీ మెజారిటీతో గెలిపించండి

కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు వెంకటేశ్‌ పిలుపునిచ్చారు.

Published : 09 May 2024 07:11 IST

సినీ నటుడు వెంకటేశ్‌

కలిదిండి, న్యూస్‌టుడే: కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు వెంకటేశ్‌ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలిదిండిలో కామినేనికి మద్దతుగా బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎన్డీయే కార్యాలయం నుంచి పడమటిపాలెం, ఎస్‌ఆర్పీ అగ్రహారం, సానారుద్రవరం, కోరుకొల్లు మీదుగా కైకలూరు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్‌ను చూసేందుకు కూటమి శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. దారి పొడవునా బారులుదీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకుసాగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img