icon icon icon
icon icon icon

మా ఊరిలో ఓటుకు నోటు వద్దే వద్దు

తమ గ్రామంలో ఓట్లు అమ్మకానికి లేవంటూ ఆ ఊరివారంతా ఒకే మాట మీద నిలబడి రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్నారు.

Published : 09 May 2024 07:17 IST

చేజర్ల (కాకివాయి)న్యూస్‌టుడే: తమ గ్రామంలో ఓట్లు అమ్మకానికి లేవంటూ ఆ ఊరివారంతా ఒకే మాట మీద నిలబడి రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామంలో ఈ మేరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థులకు విజ్ఞప్తి. మా గ్రామంలో ఓట్లు అమ్మకానికి లేవు. మేము మీకు అన్ని విధాలా సహకరిస్తాం. మీరు మా గ్రామ అభివృద్ధికి సహకరించాలి’ అని కోరుతూ కూడళ్లలో బ్యానర్లు కట్టారు. ప్రతి ఇంటి ముందు స్టిక్కర్లు అంటించి ఐక్యతను చాటుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img