icon icon icon
icon icon icon

Chandrababu: జగన్‌కు తల్లి, చెల్లి ఎందుకు దూరమయ్యారో చెప్పాలి?: చంద్రబాబు

సీఎం జగన్‌కు తల్లి, చెల్లి ఎందుకు దూరమయ్యారో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Published : 25 Apr 2024 22:16 IST

రైల్వే కోడూరు: సీఎం జగన్‌కు తల్లి, చెల్లి ఎందుకు దూరమయ్యారో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. జగన్‌కు వాడుకోవడం.. వదిలేయడం అలవాటేనని విమర్శించారు. అన్నమయ్యజిల్లా రైల్వేకోడూరులో చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని పోరాడినందుకు అంగళ్లులో తనపై, తెదేపా కార్యకర్తలపై.. వైకాపా మూకలతో దాడి చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. నడమంత్రపు సిరి రావడంతో పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘వివేకాను చంపింది ఎవరు? హంతకుడిని పక్కన పెట్టుకుని.. దేవుడికే తెలియాలి అంటారు. వివేకాను హత్య చేస్తే.. గుండెపోటు అని సాక్షిలో చెప్పారు. కుటుంబంలోని గొడవలను మనపైకి నెడుతున్నారు. తగాదాలుంటే మీరు మీరు తేల్చుకోవాలి. ఎన్నికల వేళ జగన్ అమాయకపు ముఖం పెట్టి సానుభూతికి యత్నిస్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తికి వైకాపా టికెట్‌ ఇచ్చింది. వైకాపా హయాంలో స్మగ్లర్లను పెంచి పోషించారు. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తి జగన్‌. ఐదేళ్లు పరదాల చాటున తిరిగిన జగన్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారు. జగన్‌లాంటి ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదు. వైకాపా పాలనలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారు’’ అని చంద్రబాబు అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ... చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు. వైకాపా అరాచకాలను ఎదురించేందుకు యువత ధైర్యంగా ముందుకు రావాలన్నారు. ఇవాళ డబ్బుకు లొంగని నవతరం ఉంది.. మీ వెనుక మేమున్నాం అంటూ యువతకు భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img