icon icon icon
icon icon icon

Andhra news: మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీవేటు

మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Updated : 08 May 2024 22:11 IST

అమరావతి: మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మాచర్ల సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా శ్రీహరిని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారులకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ చేసిన అధికారులకు ఎన్నికల విధులు అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. తెదేపా నేతల ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, సదుం ఎస్సై మారుతిపై మంగళవారం ఎన్నికల సంఘం బదిలీవేటు వేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డిని కూడా ఈసీ బదిలీ చేసింది. కొత్త డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img