Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Oct 2022 13:20 IST

1. వైకాపా దుశ్చర్య.. రైతుల పాదయాత్రపైకి వాటర్‌ బాటిళ్లు..

మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై వైకాపా శ్రేణుల కవ్వింపులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో పాదయాత్రగా వెళ్తున్న  రైతులను రెచ్చగొట్టేలా వైకాపా కార్యకర్తలు వాటర్‌ బాటిళ్లు విసిరారు. ఆజాద్‌ చౌక్‌ మీదుగా శాంతియుతంగా రైతులు, అఖిలపక్ష నేతలు వెళ్తుండగా నల్లబెలూన్లు ప్రదర్శిస్తూ వైకాపా శ్రేణులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇటు అమరావతి రైతులు, అటు వైకాపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేను సన్‌స్క్రీన్‌ వాడను: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో’ యాత్రలో భాగంగా సాధారణ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన వారితో మాట్లాడుతూ.. వారి ఇబ్బందులను తెలుసుకొంటున్నారు. అదే సమయంలో ప్రజలు, అభిమానులు అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానాలిస్తున్నారు. ఎండలో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌.. టాన్‌ రాకుండా ఏం వాడుతున్నారని ఓ అభిమాని అడిగన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘కాంతార’ 1.. ‘బాహుబలి’ 101.. టాప్‌ 250 సినిమాలివే..

‘కాంతార’.. ప్రస్తుతం అన్ని చోట్లా ఈ పేరే మారుమోగుతోంది. నెట్టింట ఈ కన్నడ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం హాట్‌ టాపిక్‌గా మారుతోంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. అధిక వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ప్రకటించిన ‘టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌’ జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ₹ 3 లక్షల ల్యాప్‌టాప్‌.. ప్రత్యేకతలు ఏంటంటే?

సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫీచర్‌ ఫోన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్లు.. ఆ తర్వాత మడత ఫోన్లు వచ్చాయి. తాజాగా ఆసుస్ కంపెనీ మడత ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆసుస్‌ జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీ (Asus Zenbook 17 Fold OLED) పేరుతో ఈ ల్యాపీని తీసుకొచ్చింది.  ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్‌ ఇదేనని ఆసుస్‌ కంపెనీ చెబుతోంది. మరి, ఈ ల్యాప్‌టాప్‌ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫైనల్‌కు వెళ్లేది ఆ రెండు జట్లే: సునీల్‌ గావస్కర్‌

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. పసికూనలాంటి జట్లు మాజీ చాంఫియన్లు, దిగ్గజ జట్టను మట్టికరిపిస్తుండటంతో.. టోర్నీ ఆరంభంలోనే అసలు సిసలు క్రికెట్‌ మజాను అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఇక అసలైన సూపర్‌ 12 గ్రూప్‌ మ్యాచ్‌లు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్‌ చేరేదెవరు..? కప్‌ గెలిచేదెవరు? అంటూ పలువురు అంచనాలు వేస్తున్నారు. మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కూడా తన ఫెవరేట్‌ జట్లేంటో వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉత్తరాఖండ్‌లో ఘోరం.. కుప్పకూలిన కేదార్‌నాథ్‌ యాత్రికుల హెలికాప్టర్‌

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. ఫటా హెలిప్యాడ్‌ నుంచి యాత్రికులను తీసుకెళ్తుండగా.. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ్‌ ఛాటి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆరు మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కాగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సత్ప్రవర్తన కారణంగానే బిల్కిస్‌ బానో దోషుల విడుదల: గుజరాత్‌ సర్కారు

బిల్కిస్‌ బానో (Bilkis Bano) అత్యాచార కేసులో దోషుల విడుదల ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించామని, 14 ఏళ్లకు పైగా జైల్లో గడిపినందునే వారిని విడుదల చేశామని గుజరాత్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. బిల్కిస్‌ బానో కేసులో దోషులకు రెమిషన్‌ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒక్కసారి పెట్టుబడి.. బీమాతో పాటు రెండింతలకు పైగా రాబడి!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (LIC) మరో కొత్త జీవిత బీమా పాలసీని తీసుకొచ్చింది. ‘ఎల్‌ఐసీ ధన వర్ష (ప్లాన్‌ 866)’ పేరిట దీన్ని అందిస్తోంది. దీంట్లో బీమాతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకవేళ మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. ఇది క్లోజ్డ్‌ ఎండెడ్‌ ప్లాన్‌. 2023 మార్చి 31తో ప్లాన్‌ విక్రయాలు ముగియనున్నాయి. ఇది నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటివ్‌, ఇండివిజువల్‌, సేవింగ్స్‌, సింగిల్‌ ప్రీమియం జీవిత బీమా పథకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘గీతాఆర్ట్స్‌’లో ‘గీత’ వెనుక కథ అదే.. అందుకే ఆ పేరు పెట్టాం: అల్లు అరవింద్‌

మహా నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలను అల్లు అరవింద్‌ ‘ఆలీతో సరదాగా’ మొదటి భాగంలో  పంచుకున్నారు. రెండో భాగంలో మరికొన్ని విషయాలను చెప్పారు. వాటితో పాటు చిరంజీవి, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ల గురించి అల్లు అరవింద్‌ చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జమ్మూకశ్మీర్‌లో మళ్లీ పౌరులే లక్ష్యంగా హత్యలు.. నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి

జమ్మూకశ్మీర్‌లో మరోసారి మైనార్టీలు, వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపగా.. తాజాగా మరో ఇద్దరు వలసకూలీలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. షోపియాన్‌లోని హర్మెన్‌ ప్రాంతంలో వలసకూలీలు నివసిస్తున్న ఇంటిపైకి ఉగ్రవాదులు గ్రనేడ్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని