Prakasam: ఫలించని స్టాప్‌ లాక్‌ ఏర్పాటు ప్రయత్నాలు.. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఆగని నీటి వృథా

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు వద్ద స్టాప్‌ లాక్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Published : 09 Dec 2023 20:05 IST

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు అడుగు భాగంలోని ఎలిమెంట్స్‌ నీటిపాలైన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి జలాశయానికి సంబంధించిన రెండో గేటులోని అడుగు భాగం కొంత మళ్లీ నీటిలో కొట్టుకుపోయింది. ప్రాజెక్టులోని నీళ్లు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు స్టాప్‌ లాక్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్టాప్‌ లాక్‌ గేటు ఏర్పాటు చేస్తున్న క్రమంలో హుక్‌ తెగిపోయి నీటిలో పడిపోయింది. దీంతో నీటిని నిలుపుదల చేయడం కష్టంగా మారింది. నీటిలో పడిపోయిన హుక్‌ను బయటకు తీసి, స్టాక్‌ లాక్‌తో వెల్డింగ్ చేసే ప్రక్రియ పూర్తి చేసి మరోసారి స్టాక్‌ లాక్‌ అమర్చేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం చీకటి పడటం, వెల్డింగ్‌ ప్రక్రియ చేపట్టేందుకు కావాల్సిన సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని