Updated : 06 Jul 2022 13:04 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. KTR: గ్యాస్ బండపై బాదుడు.. కేటీఆర్‌ సెటైరికల్‌ ట్వీట్‌

కేంద్ర ప్రభుత్వ విధానాలను తరచూ తనదైన శైలిలో ఎండగట్టే తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. తాజాగా మరో సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.50మేర పెంచిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘మంచి రోజులు వచ్చేశాయ్‌ (అచ్చేదిన్‌ ఆగయా).. అందరికీ శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ ధరను కేంద్రం పెంచేసింది. ప్రధాని సిలిండర్‌ ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చేశారు’’ అని కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌ 450 పరుగులు చేయాలని కోరుకున్నా: బెన్‌స్టోక్స్‌

భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ ఛేదనతో రికార్డు సృష్టించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 378 పరుగులను ఇంగ్లాండ్‌ అలవోకగా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 2-2తో సమం చేసుకుంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌కిదే భారీ లక్ష్య ఛేదన కావడం విశేషం. ఇంతకుముందు ఆసీస్‌పై 359 పరుగులను ఛేదించి విజయం సాధించింది. అయితే తమకు 450 పరుగులను నిర్దేశించినా ఛేదించేందుకు సిద్ధమని మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆటో వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయింది.. ఠాక్రేపై శిందే సెటైర్‌..!

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందేకు తన స్వస్థలంలో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం ఠాణె వెళ్లగా ఆయన మద్దతుదారులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన తన మాజీ బాస్‌, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయిందంటూ ఠాక్రేకు కౌంటర్‌ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటి?

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం భార‌తీయ పౌరుల ఆదాయంపై ప‌న్నులు విధించ‌డం మాత్ర‌మే కాకుండా మిన‌హాయింపులు, రాయితీల‌ను క్లెయిమ్ చేసుకునేందుకు కూడా అవ‌కాశం క‌ల్పిస్తుంది. ప‌న్ను చెల్లింపుదారుల ఆదాయం, ఖ‌ర్చు చేసిన విధానంపై మిన‌హాయింపులు ఆధార‌ప‌డి ఉంటాయి. కానీ, ఆదాయం ఖ‌ర్చు చేసిన విధానంతో సంబంధం లేకుండా అంద‌రికీ ఒకే ర‌కమైన ప్ర‌యోజ‌నాల‌ను ఇచ్చేదే ప్ర‌మాణిక త‌గ్గింపు( స్టాండర్డ్ డిడ‌క్ష‌న్). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారీ వర్షాలతో ముంబయికి ఆరెంజ్‌ అలర్ట్‌..

రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలు మునిగిపోవడంతో స్థానిక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్రెండీ బిచ్చగాడు.. మోపెడ్‌పై మైక్‌తో..

బాబూధర్మం, అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ వినూత్న రీతిలో తెనాలికి చెందిన గోపిరెడ్డి యాచించడం చూసినవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంగళగిరి అంబేడ్కర్‌ బొమ్మ కూడలిలో మంగళవారం ఉదయం టీవీఎస్‌ మోపెడ్‌పై మైక్‌ ఏర్పాటు చేసుకుని రికార్డు ద్వారా ధర్మం చేయమంటూ యాచిస్తూ కనిపించాడు. చూసిన వారు రోజులు మారాయి.. ధర్మం చేయమని నోటితో అడిగే కాలం చెల్లింది అంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. నంద్యాల అడవుల్లో వైద్యానికి సంబంధించి మూలికల కోసం వెళ్లినప్పుడు కాలిలో ముళ్లు దిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్‌బై..?

7. అదుపులోనే మహమ్మారి.. కొత్త కేసులెన్నంటే..? 

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. మంగళవారం 4.54 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,159 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 3.56 శాతంగా నమోదైంది. మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ కట్టడిలోనే ఉండగా.. తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌లో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 15,394 మంది కోలుకున్నారు. 28 మంది మరణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు: చిరంజీవి

ప్రముఖ సినిమా ఎడిటర్‌ గౌతంరాజు (Gautham Raju) మరణం వ్యక్తిగతంగా తనకు, సినీ పరిశ్రమకు(Cinema Industry) పెద్దలోటని అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గౌతంరాజు మరణంతో దిగ్భ్రాంతికి గురైన ఆయన సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ‘‘గౌతంరాజు లాంటి గొప్ప ఎడిటర్‌ని కోల్పోవడం దురదృష్టకరం. ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్‌ అంత వాడి!! మితభాషి అయినప్పటికీ ఎడిటింగ్‌ మెళకువలు అపరిమితం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సైబర్‌ బీమా.. ఆన్‌లైన్‌ లావాదేవీలకు ధీమా

 మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోయాయి. దాంతో పాటే ఆన్‌లైన్‌ మోసాలూ ఎగబాకాయి. ఇటీవల పాలసీబజార్‌ 4,500 మందిని సర్వే చేసింది. వీరిలో దాదాపు 20 శాతం మంది సైబర్‌ మోసాల బారిన పడినట్లు తెలిపారు. కానీ, కేవలం 24 శాతం మంది మాత్రమే సైబర్‌ ఇన్సూరెన్స్‌ (Cyber Insurance) పాలసీ తీసుకున్నారు. అనధీకృత లావాదేవీలనుంచి రక్షించుకోవడానికి సైబర్‌ ఇన్సూరెన్స్‌ (Cyber Insurance) ఉండాల్సిందేనని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కట్టడి చేయలేకపోయారు.. కప్పు సాధించలేకపోయారు

ఇంగ్లాండ్‌లో టీమ్‌ఇండియా ఇదివరకు మూడుసార్లు టెస్టు సిరీస్‌లు సాధించినా ఎన్నడూ 3 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చలాయించలేదు. అయితే, ఈ సిరీస్‌లో ఐదో టెస్టుకు ముందే 2-1 ఆధిక్యంలో నిలవడంతో ఈసారి చరిత్ర తిరగరాస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. జోరూట్‌, బెయిర్‌ స్టో టీమ్‌ఇండియా ఆశలకు గండి కొట్టారు. భారత బౌలర్లు వారిద్దరినీ కట్టడి చేయలేకపోయారు. భారత్‌ కప్పు సాధించలేకపోవడానికి కారణాలను పరిశీలిస్తే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts