Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు..

Updated : 08 Feb 2023 17:12 IST

1. భాజపా ‘అమృత్‌కాల్‌’.. దేశ ప్రజలకు ఆపద కాలం: హరీశ్‌రావు

ప్రజలకు కావాల్సినంత పవర్‌ ఇచ్చినందునే తమకు ‘పవర్‌’ (అధికారం) ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పవర్‌ హాలిడే ఇచ్చినందునే కాంగ్రెస్‌కు ప్రజలు ‘హాలిడే’ ఇచ్చారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: కేంద్రం

విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) రాజధానిగా అమరావతి (Amaravathi)ని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్రం తెలిపింది. బుధవారం వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మోదీపై ఆరోపణలు.. రాహుల్‌ గాంధీపై చర్యలకు భాజపా డిమాండ్‌..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై భాజపా మండిపడింది. ఆ అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరింది. మంగళవారం జరిగిన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన భాజపా.. బుధవారం సభ మొదలు కాగానే రాహుల్‌ గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌

దిల్లీ మద్యం కేసు (Delhi liquor case) వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. భారాస ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ (CBI) అరెస్ట్‌ చేసింది. దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆటపై దృష్టి పెట్టండి.. పిచ్‌పై కాదు : ఆసీస్‌ ఆరోపణలకు రోహిత్‌ గట్టి కౌంటర్‌

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ( Border-Gavaskar Trophy) ప్రారంభానికి ఒక్క రోజు ముందు తొలి టెస్టు(IND vs AUS) జరిగే నాగ్‌పూర్‌ పిచ్‌పై ఆస్ట్రేలియా మాజీలు, అక్కడి మీడియా వర్గాలు ఆరోపణలు చేశాయి. పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చకుంటున్నారని భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ ఆరోపణలపై టీమ్‌ఇండియా(Team India) కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) స్పందించాడు. ఆటపై దృష్టి పెట్టాలని.. పిచ్‌పై కాదంటూ ప్రత్యర్థికి కౌంటర్‌ ఇచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. QR కోడ్‌ స్కాన్‌తో ఇక నాణేలు.. 12 నగరాల్లో వెండింగ్‌ మెషిన్లు: RBI

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాణేలు కావాలనుకునేవారి కోసం కాయిన్‌ వెండింగ్‌ మెషిన్లను (Coin vending machine) తీసుకొస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ను (QR code) స్కాన్‌ చేయడం ద్వారా మెషిన్ల నుంచి నాణేలను పొందొచ్చు. దేశంలోని 12 నగరాల్లో తొలుత ఈ వెండింగ్‌ మెషిన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) బుధవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘బ్లూ జాకెట్‌’తో ‘గ్రీన్‌’ మెసేజ్‌ ఇచ్చిన ప్రధాని మోదీ..!

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీలం రంగు జాకెట్‌లో కన్పించారు. సాధారణంగా మోదీ అలాంటి వస్త్రధారణలోనే కన్పిస్తారు కదా.. ఇందులో అంత విశేషమేముంది అంటారా? అయితే, ఈ జాకెట్‌ నిజంగానే ప్రత్యేకమైనది. ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి దీన్ని తయారు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!

అమెరికా పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూపు (Adani Group) షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని అటు పార్లమెంటులోనూ విపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎటుచూసినా శవాల గుట్టలే.. భూకంప మృతులు 11వేలకు పైనే!

తుర్కియే (Turkey), సిరియా (Syria)ల్లో భారీ భూకంపం సృష్టించిన విలయంతో  అక్కడ హృదయవిదారక దృశ్యాలు కొనసాగుతున్నాయి. వేలాదిగా భవనాలు కుప్పకూలి సమాధులను తలపిస్తుండటంతో ఆ శిథిలాల నుంచి మృతదేహాల్ని వెలికి తీసేందుకు సహాయక బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హఠాత్తుగా బ్రిటన్‌ చేరుకొన్న జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్‌ పైలట్లకు అక్కడ శిక్షణ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) బ్రిటన్‌ చేరుకొన్నారు. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఆయన యూకే రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన వివరాలు ముందుగా ఎక్కడా బయటకు వెల్లడికాలేదు. ఈ పర్యటనలో ఆయన బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషిసునాక్‌(Rishi Sunak)తో కూడా భేటీ కానున్నారు. యూకే పార్లమెంట్‌ను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించే అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని