Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 27 Jan 2023 17:07 IST

1. Balakrishna: చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ

తారకరత్న ఆరోగ్య పరిస్థితి  నిలకడగానే ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం తారకరత్న బీపీ 120/80 చూపిస్తుంది. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయింది. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మిగతా పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించారు..’’ పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Pariksha Pe Charcha: మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. నివృత్తి చేసిన ప్రధాని

పరీక్షలు సమీపిస్తోన్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తొలగించేందుకు ప్రధాని మోదీ(Modi) శుక్రవారం విద్యార్థులతో సంభాషించారు. వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు పరీక్షా పే చర్చ(ParikshaPeCharcha2023)లో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్‌ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థిని అక్షర.. మోదీని ప్రశ్నించింది. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలని అడిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Stock Market: భారీగా పతనమైన మార్కెట్లు.. 2రోజుల్లో ₹10 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌మార్కెట్లు మదుపర్లను శుక్రవారం భారీ నష్టాల్లో ముంచాయి. కీలక సూచీలు రెండు శాతానికి పైగా కుంగి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బకొట్టాయి. క్రితం సెషన్‌లోనూ సూచీలు భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. రెండు రోజుల వరుస నష్టాలతో మదుపర్లు దాదాపు రూ.10.65 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Axar Patel : ప్రియురాలిని వివాహమాడిన ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌..

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(Axar Patel) ఓ ఇంటివాడయ్యాడు. అతడి ప్రియురాలు మేహా పటేల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వడోదరలో గురువారం ఘనంగా జరిగిన ఈ వేడుకకు క్రికెటర్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కీలక పదవి..!

భారత అమెరికన్‌, తెలుగు వ్యక్తి రాజాచారి (Raja Chari) అగ్రరాజ్యంలో మరో అరుదైన ఘనత అందుకోబోతున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ (US Airforce)లో బ్రిగేడియర్‌ జనరల్‌ గ్రేడ్‌ పదవికి రాజాచారిని అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) నామినేట్‌ చేశారు. ఈ మేరకు యూఎస్‌ రక్షణ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ నామినేషన్‌ను సెనేట్‌ ఆమోదించాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Airtel prepaid plans: ఎయిర్‌టెల్‌లో మరో 2 కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్.. ప్రయోజనాలివే!

తమ యూజర్ల కోసం టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) మరో రెండు సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను (prepaid plans) తీసుకొచ్చింది. అపరిమిత కాల్స్, ఎక్కువ డేటా వినియోగించేవారికి ఇవి సరైన ప్లాన్స్ అని ఎయిర్‌టెల్‌ వర్గాలు తెలిపాయి. నెలకు 60 జీబీ డేటా అందించే కొత్త ప్లాన్లతో ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల మధ్య వ్యత్యాసం తగ్గనున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి కన్నుమూత

ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి (Srinivasa Murthy) మృతి చెందారు. గుండెపోటుతో  చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో ఏళ్ల నుంచి సినీ రంగానికి సేవలు అందిస్తున్నారు. సూర్య, అజిత్‌, మోహన్‌లాల్‌, కార్తి‌, విక్రమ్‌తోపాటు పలువురు స్టార్‌ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. సహాయనటుడిగానూ ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్‌

తన స్టైల్‌తో ట్రెండ్‌ సెట్‌ చేసిన హీరో రజనీకాంత్(Rajinikanth)‌. నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఆయనను చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతుంటారు. అయితే.. రజనీ మాత్రం తన భార్య తనను ఎంతో మార్చిందని.. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో తన భార్య లత(Latha) గురించి ఎన్నో వేదికలపై చెప్పిన రజనీ.. తాజాగా మరోసారి ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్‌ పాదయాత్ర నిలిపివేత!

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) నేడు జమ్మూ- కశ్మీర్‌(Jammu Kashmir)లో తాత్కాలికంగా నిలిచిపోయింది. యాత్ర మార్గంలో తీవ్రమైన భద్రతా లోపాలతోపాటు భారీ జన సమూహాలను నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం వైఫల్యమే దీనికి కారణమని కాంగ్రెస్‌(Congress) నేతలు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Sourav Ganguly : కోహ్లీ.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడు : గంగూలీ

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) మునుపటి ఫామ్‌ను అందుకుని ఇటీవల బంగ్లాదేశ్‌, శ్రీలంకపై సెంచరీలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. టెస్టుల్లోనూ కింగ్‌ ఇదే దూకుడును ప్రదర్శించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ(Sourav Ganguly) కూడా ఇదే విషయంపై స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు