Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 20 Dec 2022 17:01 IST

1. Kidnap: నా అనుమతితోనే జానీ తీసుకెళ్లాడు.. సిరిసిల్ల యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. చివరికి కిడ్నాప్‌ ఘటనలో సీన్‌ రివర్స్‌  అయ్యింది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ సదరు యువతి తెలిపింది. జానీ అనే యువకుడిని పెళ్లి చేసుకుని సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Putin: ఆ నాలుగు ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంది: పుతిన్‌

ఉక్రెయిన్‌ (Ukraine)లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యా (Russia) ఇటీవల తమ దేశంలో ఏకపక్షంగా విలీనం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు ‘అత్యంత క్లిష్టంగా’ ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ (Putin) స్వయంగా అంగీకరించడం గమనార్హం. కొత్త ముప్పులను ఎదుర్కొనేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Ambati Rambabu: శవాలపై నేను పేలాలు ఏరుకోవడమేంటి?: మంత్రి అంబటి

పరిహారం సొమ్ములో లంచం ఆరోపణలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించిందే తానని చెప్పారు. ఈ విషయంలో తనపై విమర్శలు జనసేన పార్టీ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. T20 League: ప్రతి జట్టుకు రషీద్‌ ఖాన్‌లాంటి ఆటగాడు అవసరం: సంజయ్‌ మంజ్రేకర్‌

మరో మూడు రోజుల్లో భారత టీ20 లీగ్‌ మినీ వేలం జరగనుంది. బెన్ స్టోక్స్, ఆడమ్ జంపా, మయాంక్‌ అగర్వాల్‌, కేన్ విలియమ్సన్‌ వంటి స్టార్లను ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో వారంతా వేలంలోకి వచ్చేశారు. దీంతో కీలక ఆటగాళ్లను దక్కించుకొనేందుకు పోటీ పడే అవకాశం ఉంది. పంజాబ్‌, హైదరాబాద్ జట్ల వద్ద ఎక్కువ సొమ్ము ఉండటం విశేషం. ఈ క్రమంలో అన్ని జట్లూ ఉత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తాయని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Puri Musings: జీవితాలు నాశనం చేసుకోకండి.. యూత్‌కు పూరీ జగన్నాథ్‌ విన్నపం

వయసులో ఉన్నప్పుడు ఏదో సాధించాలనే తపన ఉంటుందని. దానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని పూరీజగన్నాథ్‌(Puri Jagannadh) అన్నారు. యూత్‌ ఆలోచనలను పక్కదోవ పట్టించేవాళ్లు చాలా మంది ఉంటారని.. వారితో అప్రమత్తంగా ఉండాలని పూరీ హితవు పలికారు. పూరీ మ్యూజింగ్స్‌(Puri Musings)లో ఈసారి యూత్‌ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Mallikarjun Kharge: ‘శునకమైనా చనిపోయిందా?’.. ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ

కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన ‘శునకం’ వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందుకు కాంగ్రెస్‌ నేత ససేమిరా అనడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ దన్‌ఖడ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. FIFA World cup 2022: అతడు అర్జెంటీనా ‘ఫైనల్‌’ వెపన్‌..!

2022 ఫిఫా ప్రపంచకప్‌ను మెస్సి మాయ పూర్తిగా కమ్మేసింది. కానీ, మెస్సి విజయాల గురించి చెప్పాలంటే అందుకు సహకరించిన వ్యక్తి పేరును ప్రస్తావించాల్సిందే. మిస్టర్‌-10 జీవితంలో సాధించిన కీలక విజయాల్లో అతడి పాత్ర ఉంది. అసలు ఫైనల్స్‌ అంటే చాలు అతడు రెచ్చిపోయి ఆడతాడు. అతడిని అర్జెంటీనా(Argentina) ‘ఫైనల్స్‌ ఆయుధం’ అంటే అతిశయోక్తి కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. రంగంలోకి దిగ్విజయ్‌

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. సమస్య పరిష్కారానికి ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దించింది. దీంతో సమస్య పరిష్కారానికి ముఖ్యనేతలతో మాట్లాడారు. సీనియర్లకు సంబంధించిన సమస్యలపై కూర్చొని చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉద్దేశపూర్వక ఎగవేతలు.. టాప్‌-50 నుంచి రావాల్సినవే ₹92,570 కోట్లు!

ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో పేరున్న టాప్‌-50 మంది నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తమే రూ.92,570 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌ సోమవారం లోక్‌సభకు తెలిపారు. దేశం విడిచి పారిపోయిన నీరవ్‌మోదీ, మెహుల్‌చోక్సీలకు చెందిన గీతాంజలి జెమ్స్‌ లిమిటెడ్‌, నక్షత్ర బ్రాండ్స్‌, గిలి ఇండియా లిమిటెడ్‌ల నుంచి రూ.10,444 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. FIFA World cup 2022: మెస్సి రెండో గోల్‌పై వివాదం..!

ఫిఫా ప్రపంచకప్‌లో ఫుట్‌బాల్‌ మాంత్రికుడు లియొనెల్‌ మెస్సి(Lionel Messi) చేసిన రెండో గోల్‌పై వివాదాస్పద చర్చకు తెరలేచింది. మ్యాచ్‌ అదనపు సమయలో చేసిన ఈ గోల్‌తో అర్జెంటీనా(Argentina) గెలుపు ముంగిటికి చేరుకొంది. కానీ, చివరి నిమిషాల్లో కిలియన్‌ ఎంబాపె ఓ పెనాల్టీని గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌(France) ఆశలను సజీవంగా ఉంచాడు. వాస్తవానికి మెస్సి(Lionel Messi) చేసిన రెండో గోల్‌ను రెఫరీలు ఇచ్చి ఉండాల్సింది కాదని ఫ్రాన్స్‌(France) అభిమానులు వాదిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు