Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 05 Mar 2024 09:48 IST

1. నగరంలో భూముల లెక్కలు.. ఇక పక్కా

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని భూముల లెక్కను మరింత పకడ్బందీగా చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎస్టేట్‌ విభాగం అధికారులు ఏడు జిల్లాల పరిధిలోని ల్యాండ్‌ పార్శిళ్లపై ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల ఎకరాలపైనే హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ బ్యాంకులో ఉన్నట్లు తేలింది. ఇందులో 2031 ఎకరాల్లో కోర్టు కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పూర్తి కథనం

2. స్పృహ కోల్పోతే..

అదో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌. ఇంట్లో పెద్దవాళ్లిద్దరే ఉన్నారు. అంతలో కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన ఒక్కసారిగా స్పృహతప్పి కూలబడిపోయారు. ఆమె కంగారు పడి, ఏడుస్తూనే సహాయం కోసం ఎదురింటికి వెళ్లారు. తలుపు తాళం వేసి ఉంది. ఏం చేయాలో తెలియక ఆదుర్దా పడుతూ ఇంటికి తిరిగొచ్చేసరికి ఆయన కళ్లు తెరచి చూస్తున్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరికైనా గాబరా తప్పదు. ఇంతకీ ఇదేం సమస్య? పూర్తి కథనం

3. కోడళ్లకు కొత్త కష్టం!

ధరూరు మండలానికి చెందిన కృష్ణవేణి రెండేళ్ల కిందట వివాహం చేసుకుని జిల్లాలో మరో మండలం పరిధిలోని గ్రామంలో అత్తారింటికి వెళ్లింది. పుట్టినింట్లో రేషన్‌ కార్డులో పేరు తొలగించి అత్తారింటి కార్డులో చేర్చాలని వినతి పెట్టుకుంది. అధికారులు విచారించి పుట్టినింటి కార్డులో పేరు తొలగించారు. కానీ అత్తారింటి కార్డులో పేరు చేర్చలేదు. పేరు చేర్చటానికి ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ లేదని అధికారులు తీరిగ్గా సెలవిచ్చారు. పూర్తి కథనం

4. Vijayawada: కట్టనూ లేరు.. కట్టినవి ఇవ్వనూ లేరు!

ఈ చిత్రాలను చూస్తే... తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలపై వైకాపా ప్రభుత్వం పగబట్టినట్లుగా కనిపిస్తోంది. తెదేపా హయాంలో దాదాపుగా పూర్తయిన టిడ్కో గృహాలను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. విజయవాడ నగరానికి సమీపంలో జక్కంపూడి, షాబాద, వేమవరంలో ఆరు వేల గృహాల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిలో చాలా వరకు గృహాలు 90 శాతం పనులు తెదేపా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. పూర్తి కథనం

5. Tata Motors: టాటా మోటార్స్‌.. రెండు కంపెనీలుగా

టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించాలనే ప్రతిపాదనకు సోమవారం బోర్డు ఆమోదం తెలిపింది. వాణిజ్య వాహనాల వ్యాపారం, దాని సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థగా; ప్రయాణికుల వాహనాల (పీవీలు) వ్యాపారాలు, ఈవీలు (విద్యుత్‌ వాహనాలు), జేఎల్‌ఆర్‌ (జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌), దాని సంబంధిత పెట్టుబడులు మరొక సంస్థగా విడదీయాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్‌ సమాచారమిచ్చింది. పూర్తి కథనం

6. కాసులిస్తేనే.. క్రమబద్ధీకరణ..!

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో.. ఎన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారనే లెక్కన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగడం లేదు. ఎంత లాబీయింగ్‌ చేయగలరు.. ఎంత ముట్టజెబుతారనే ప్రాతిపదికనే.. క్రమబద్ధీకరిస్తున్నారు. ఆలయంలో రెండున్నర దశాబ్దాలకుపైగా.. నామమాత్ర  జీతాలతో 60 మందికి పైగా ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆలయంలో ఏ పెద్ద పండగ నిర్వహణ సజావుగా సాగాలన్నా.. వీరే కీలకం. పూర్తి కథనం

7. పిల్లలను కాపాడే నిద్ర టూల్‌

ఆరోగ్యంగానే ఉంటారు. ఎలాంటి సమస్యలూ ఉండవు. అయినా పిల్లల్లో కొందరు హఠాత్తుగా చనిపోతుంటారు. దీన్ని సడెన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ (సిడ్స్‌) అంటారు. చాలావరకు ఏడాదిలోపు పిల్లల్లో, అదీ నిద్రలోనే ఎక్కువగా తలెత్తుతుంటుంది. దీనికి కారణమేంటనేది తెలియదు. కానీ శ్వాస తీసుకోవటాన్ని, నిద్రలోంచి మేల్కొనటాన్ని నియంత్రించే మెదడు భాగంలో సమస్యలు కారణం కావొచ్చని భావిస్తున్నారు. పూర్తి కథనం

8. కోటయ్యా.. నువ్వే ఆదుకోవయ్యా..

 రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. కోటయ్య జాతరకు మరో మూడు రోజులే ఉన్నా కనీసం అధికార యంత్రాంగం రెండోసారి సమీక్ష కూడా నిర్వహించకపోవడం గమనార్హం. పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఎప్పుడు పూర్తిచేస్తారని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు  జోక్యం చేసుకొని పనులు జరిగేలా చూడాలని కోరుతున్నారు. పూర్తి కథనం

9. అడిగేదెవరని.. ఆపేదెవరని!!

వైకాపా ఆధ్వర్యంలో మాధవధార వుడా కాలనీలో సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమాల పేరిట అనుమతులు లేకుండా ప్రధాన రహదారి మధ్యలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. వైకాపా పెద్దలు సభకు వస్తున్నారని ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. వుడా కాలనీ వరకు వచ్చే 48ఎ ఆర్టీసీ బస్సులను రెండు కిలోమీటర్ల ముందు మాధవధార వద్ద ఆపేసి.. అక్కడి నుంచి వెనక్కి మళ్లించారు. పూర్తి కథనం

10. అదరగొట్టారు!

ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు హిమబిందు, చైతన్య. ఈ ఇద్దరు మహిళలూ గత ఏడాది గురుకుల విద్యాసంస్థ అధ్యాపక పోస్టులకు నియామక పరీక్షలు రాశారు.. జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, పాఠశాల విభాగాల్లో చక్కని ప్రతిభ చూపి ఇటీవలే కొలువులకు ఎంపికయ్యారు. స్ఫూర్తిదాయకమైన వీరి కృషి వారి మాటల్లోనే.. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు