Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Aug 2023 09:17 IST

1. మతిభ్రమించే సీఎంపై పవన్‌ వ్యాఖ్యలు: మంత్రి కారుమూరి

సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని ఏకవచనంతో విమర్శించడం, వాలంటీర్ల వ్యవస్థపై నీచమైన వ్యాఖ్యలను చూస్తుంటే.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మతిభ్రమించిదనే విషయం అర్థమవుతుందని మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరావు అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అక్రమార్కులను వదిలేదే లే!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అనకాపల్లి జిల్లా వాసులు సోమవారం ఘన స్వాగతం పలికారు. వారాహి విజయయాత్రలో భాగంగా కశింకోట మండలం విస్సన్నపేటలోని భూ అక్రమాలు పరిశీలించడానికి ఆయన సోమవారం విచ్చేశారు. అగనంపూడి టోల్‌గేటు నుంచి మారేడుపూడి, గొల్లవానిపాలెం, అనకాపల్లి జాతీయ రహదారి, కొత్తూరు, కశింకోట ప్రాంతాల్లో ప్రజలు రహదారిపైకి వచ్చారు. మహిళలు పవన్‌కల్యాణ్‌కు హారతులు ఇచ్చారు. జనసైనికులు బైకుల ర్యాలీతో సందడి వాతావరణం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రైలులో భద్రతెంత?

‘రైలులో ప్రయాణించండి.. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరండి’ అని రైల్వే అధికారులు చెప్పే మాటలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. వరుస సంఘటనల నేపథ్యంలో ప్రయాణికుల్లో అభద్రతా భావం పెరుగుతోంది. రైలులో భద్రత కల్పించాల్సిన శాఖల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది ప్రయాణించే రైలులో కనీస భద్రత కల్పించకపోవడమే దొంగలకు కలిసి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాంపల్లి కోర్టులో అవినాష్‌ అనుచరుల హడావుడి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు స్థానికంగా ఉన్న వైకాపా కార్యకర్తలతోపాటు వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి కూడా గణనీయ సంఖ్యలో వచ్చారు. దీంతో కోర్టు ఆవరణలో కొంత హడావుడి నెలకొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విచారణకు కోసం సోమవారం కోర్టుకు హాజరయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీబీఎస్‌ఈ పాయే.. ఐబీ వచ్చే!

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో   24.3% మంది ‘క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ, ఫ్యాన్‌, బస్‌’ తదితర ఆంగ్ల పదాలను చదవలేకపోతున్నట్లు అసర్‌ సర్వే బహిర్గతం చేసింది. పరిస్థితి ఇలా ఉంటే సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ అంటూ సీఎం జగన్‌ గొప్పలకు పోతున్నారు. సోమవారం విద్యాశాఖపై సమీక్షిస్తూ, రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ సిలబస్‌ అమలు దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఐబీ సిలబస్‌ను ఎల్‌కేజీ, యూకేజీ నుంచే అమలు చేయాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ భూములు అధికారులే ఇచ్చారు!

 తమ కుటుంబానికి అధికారులు ప్రభుత్వ భూములు కేటాయిస్తూ డీకేటీ పట్టాలిచ్చారని అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. మేడా ఇంటి పేరుతో అతి పెద్ద కుటుంబం ఉందని, గతంలో తమ కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీకేటీ భూములిచ్చారన్నారు. ‘ఈనాడు’లో సోమవారం ‘మేడా.. మేసేశారు!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిస్తూ రాజంపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విదేశీ పర్యటనలు ఇక భారమే!

ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఉపశమనం కోసం ఇటీవల విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత ఇలాంటి వారి సంఖ్య పెరిగింది. అయితే... విదేశీ పర్యాటకంపై కొత్త పన్ను విధానం ప్రభావం చూపనుంది. టూర్‌ ఆపరేటర్ల ద్వారా ప్యాకేజీ రూపంలో వెళ్లేవారు టీసీఎస్‌ కింద (ట్యాక్స్‌ కలెక్షన్‌ ఎట్‌ సోర్స్‌) ముందస్తుగా చెల్లించే పన్ను భారీగా పెరగడమే ఇందుకు కారణం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ISRO: సూర్యుడి వైపు తొలి అడుగులు..!

చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడి గుట్టు విప్పడంపై దృష్టిసారించింది. ఈ దిశగా ‘ఆదిత్య-ఎల్‌1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. సెప్టెంబరు మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ-సి57 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సరిహద్దుల్లో సేవ!

‘దేశభక్తికి, ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి ఆడ, మగ తేడాలేదు. జన్మభూమిపై ప్రేమ ఉంటే చాలంటున్నారు’ మన సైనికురాళ్లు. ఆ ధైర్యం, తెగువను చూపే సరిహద్దుల్లో పహరా కాసే అవకాశాలను అందుకుంటున్నారు. పంజాబ్‌ అమృత్‌సర్‌లోని భారత్‌- పాక్‌ బోర్డర్‌ని అత్యంత ప్రమాదకర సరిహద్దుల్లో ఒకటిగా  చెబుతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ

కరోనా తర్వాత భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘కొత్త ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవరి తరమూ కాదు. మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని