ISRO: సూర్యుడి వైపు తొలి అడుగులు..!

చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడి గుట్టు విప్పడంపై దృష్టిసారించింది. ఈ దిశగా ‘ఆదిత్య-ఎల్‌1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 15 Aug 2023 07:10 IST

భానుడిపై పరిశోధనలకు సిద్ధమవుతున్న ‘ఆదిత్య-ఎల్‌ 1’

బెంగళూరు: చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడి గుట్టు విప్పడంపై దృష్టిసారించింది. ఈ దిశగా ‘ఆదిత్య-ఎల్‌1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. సెప్టెంబరు మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ-సి57 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుంచి గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. దీనివల్ల సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించొచ్చు. సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేయడానికి ఆదిత్యలో ఏడు సైన్స్‌ పరికరాలు ఉన్నాయి. ఎల్‌-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని పరిశీలిస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని