సరిహద్దుల్లో సేవ!

‘దేశభక్తికి, ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి ఆడ, మగ తేడాలేదు. జన్మభూమిపై ప్రేమ ఉంటే చాలంటున్నారు’ మన సైనికురాళ్లు. ఆ ధైర్యం, తెగువను చూపే సరిహద్దుల్లో పహరా కాసే అవకాశాలను అందుకుంటున్నారు.

Updated : 15 Aug 2023 05:20 IST

‘దేశభక్తికి, ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి ఆడ, మగ తేడాలేదు. జన్మభూమిపై ప్రేమ ఉంటే చాలంటున్నారు’ మన సైనికురాళ్లు. ఆ ధైర్యం, తెగువను చూపే సరిహద్దుల్లో పహరా కాసే అవకాశాలను అందుకుంటున్నారు. పంజాబ్‌ అమృత్‌సర్‌లోని భారత్‌- పాక్‌ బోర్డర్‌ని అత్యంత ప్రమాదకర సరిహద్దుల్లో ఒకటిగా  చెబుతారు. ఇక్కడ తరచూ మాదకద్రవ్యాలు, ఆయుధాలతో కూడిన డ్రోన్లు అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకొస్తుంటాయి. చొరబాటుదార్లూ ఎక్కువే. వీటిపై భద్రతా సిబ్బంది నిఘా పెట్టి, ఆ ప్రయత్నాలను అడ్డుకుంటుంటారు. స్వాతంత్య్ర వేడుకల వేళ బోర్డర్‌లో కవ్వింపు చర్యలు, దాడుల అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే సరిహద్దుల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తారు. ఇందులో భాగంగా ఈసారి అమృత్‌సర్‌ సరిహద్దు ప్రాంతంలో పహరా బాధ్యతను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ మహిళా జవాన్లకు అప్పగించింది. ‘ఒకసారి ఈ యూనిఫాం వేసుకొన్నాక  భయమన్న పదాన్నే పక్కన పెట్టేస్తాం. బుల్లెట్లు దూసుకొస్తున్నా.. వెరవం. ప్రాణాలు ఒడ్డి అయినా శత్రు మూకల నుంచి దేశాన్ని రక్షించడంపైనే మా ధ్యాస’ అంటోన్న ఈ వీరనారీమణులకు సెల్యూట్‌ చేయాల్సిందేగా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్