MCD Polls: హస్తిన.. ఆమ్ఆద్మీదేనా..! ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..!
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ సత్తా చాటనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 250 వార్డులకు గాను 150కి పైగా స్థానాలను కైవసం చేసుకోనున్నట్లు తెలిపాయి.
దిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. దేశ రాజధానిలో మాత్రం ఆమ్ఆద్మీ పార్టీ తన సత్తా చాటనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీకి ఈసారి భారీ ఆధిక్యం రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 255 వార్డులకు గాను 150కిపైగా స్థానాలు ఆప్ సొంతం చేసుకోనున్నట్లు సర్వేలు అంచనా వేశాయి. ఇక భాజపా మాత్రం 60 నుంచి 90 స్థానాలకు పరిమితం కానున్నట్లు పేర్కొన్నాయి.
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌కు ఓట్ల శాతం కూడా భారీగా రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆమ్ఆద్మీ 43శాతం ఓట్లను పొందనుండగా.. భాజపా మాత్రం 35శాతం సాధించనున్నట్లు తెలిపాయి. కాంగ్రెస్ కేవలం 10శాతానికే పరిమితం కానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. డిసెంబర్ 4న దిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగగా.. 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. దిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయా సర్వేల అంచనాలు ఇలా ఉన్నాయి.
2017లో భాజపా.. ఇప్పుడు ఆప్
మరోవైపు 2017లో దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా భారీ సీట్లను కైవసం చేసుకుంది. అప్పుడు మొత్తం 272 వార్డులుండగా (270 వార్డులకు ఎన్నికలు జరిగాయి).. అందులో 181 వార్డుల్లో భాజపా గెలిచింది. ఆమ్ఆద్మీ కేవలం 48 వార్డులకే పరిమితమయ్యింది. కాంగ్రెస్ 30వార్డుల్లో గెలవగా 11 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Job vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే..!
-
India News
US Visa: వీసా రెన్యువల్‌కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!
-
General News
Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
-
World News
Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!’