బర్డ్‌ ఫ్లూ: కేరళలో 12వేల బాతులు మృతి

రాజస్థాన్‌లో బర్డ్‌ ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో తాజాగా కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా బర్డ్‌ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది.

Updated : 13 May 2022 11:39 IST

(ప్రతీకాత్మక చిత్రం)

తిరువనంతపురం: రాజస్థాన్‌లో బర్డ్‌ ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో తాజాగా కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా బర్డ్‌ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. కేరళలోని అళపుళ, కొట్టాయం జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో 12వేలకు పైగా బాతులు మరణించినట్లు వెల్లడించారు. ఎనిమిది శాంపిళ్లను పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపగా ఐదు శాంపిళ్లలో వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బర్డ్‌ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కిలోమీటరు పరిధిలో ఉన్న సుమారు 36వేల బాతులను వధించనున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్‌లోని జల్‌మహల్‌ ప్రాంతంలో 252 కాకులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ సుమారు 50 కాకులు మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ శాంపిళ్లను భోపాల్‌కు పంపినట్లు ఇండోర్‌ ప్రధాన ఆరోగ్యాధికారిణి పూర్ణిమ గదారియా తెలిపారు. 5 కిలోమీటర్లలోపు ఉన్న ఇతర పక్షుల్లో ఫ్లూను గుర్తించేందుకు సర్వేను చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇవీ చదవండి..

పిల్లలపై వ్యాక్సిన్‌ ప్రయోగాలకు అనుమతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని