Corona: కొవిడ్‌ కట్టడి చర్యలు జనవరి 31 వరకు పొడిగింపు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై.. కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా...

Published : 27 Dec 2021 18:44 IST

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై.. కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా కొవిడ్‌ నియంత్రణ చర్యల అమలును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఎక్కడా నిబంధనలు సడలించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పండగ సీజన్‌లో రద్దీని నియంత్రించేందుకు అవసరం అనుకుంటే స్థానికంగా ఆంక్షలు, పరిమితులు విధించుకోవచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.

వ్యక్తిగత దూరం, కొవిడ్‌ నిబంధనల అమలుకు 144 సెక్షన్‌ విధించొచ్చని భల్లా తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణా చర్యలు చేపట్టాలన్నారు. కొత్త వేరియంట్ కారణంగా ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థలను పటిష్ఠం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఆక్సిజన్ లభ్యత, మందుల స్టాక్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం సోమవారం నాటికి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 578కి చేరుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని