Lok Sabha Polls: ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన భాజపా.. పోటీ చేయలేనన్న సింగర్‌ పవన్‌సింగ్‌!

భాజపా తొలి జాబితాలో చోటు దక్కించుకున్న భోజ్‌పురి సింగర్‌, నటుడు పవన్‌ సింగ్‌ ఆసన్‌సోల్‌ నుంచి పోటీ చేయలేనని వెల్లడించాడు.

Updated : 03 Mar 2024 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతోన్న వేళ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు భాజపా ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సుమారు రెండు వందల మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఈ మరుసటి రోజే పార్టీకి చుక్కెదురయ్యింది. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న భోజ్‌పురి సింగర్‌, నటుడు పవన్‌ సింగ్‌ (Pawan Singh) వెనకడుగు వేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ నుంచి తాను పోటీ చేయలేనని ఎక్స్‌ వేదికగా భాజపా అధిష్ఠానానికి తెలిపాడు.

‘భాజపా అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై విశ్వాసం ఉంచి ఆసన్‌సోల్‌ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి పోటీ చేయలేను’ అని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు పవన్‌ సింగ్‌ తెలియజేశాడు.

Lok Sabha polls: వారణాసి నుంచే మోదీ పోటీ

లోక్‌సభ పోరులో బరిలో ఉండే అభ్యర్థులను తొలి జాబితాను విడుదల చేసిన భాజపా.. కొందరు పాతవారిని తప్పించి, కొత్తవారికి అవకాశం కల్పించింది. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), గాంధీనగర్‌ నుంచి అమిత్‌ షా (Amit Shah), లఖ్‌నవూ నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌ బరిలో నిలుస్తున్నారు. తొలి జాబితాలో 28 మంది మహిళలు ఉండగా.. 47 మంది 50 ఏళ్లలోపువారే ఉండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని