సూపర్‌నోవా కాంతిని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

విశ్వాంతరాళంలో శక్తిమంతమైన సూపర్ నోవా కాంతిని కనుగొన్నట్లు భారత శాస్త్ర,

Published : 11 Jul 2021 01:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విశ్వాంతరాళంలో శక్తిమంతమైన సూపర్ నోవా కాంతిని కనుగొన్నట్లు భారత శాస్త్ర, సాంకేతిక విభాగం డీఎస్‌టీ ప్రకటించింది. విశ్వం పుట్టుకను అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. 

సూర్యుడి కంటే 25 రెట్లు అధికంగా బరువు ఉండి హైడ్రోజన్ లోపించిన నక్షత్రాల్లో జరిగే శక్తిమంతమైన విస్ఫోటం వల్ల ఈ సోపర్ నోవా కాంతి ఉద్భవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కాంతి అత్యంత ప్రకాశవంతంగా నీలి వర్ణంలో ఉందని వివరించారు. ఈ సూపర్ నోవా కాంతిని అంతరిక్ష వస్తువులను పరిశీలించే శక్తిమంతమైన దేవ్ స్థల్, సంపూర్ణ ఆనంద్ టెలిస్కోప్‌ ద్వారా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజా పరిశోధనల వల్ల ఇతర శక్తిమంతమైన గామా రే, రేడియో విస్ఫోటనాలను అధ్యయనం చేసేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని