DGCA: అలస్కా ఎయిర్‌లైన్స్‌ ఘటన.. డీజీసీఏ అలర్ట్‌

DGCA to Airlines: అలస్కా ఎయిర్‌లైన్స్‌ ఘటనపై డీజీసీఏ అప్రమత్తమైంది. బోయింగ్‌ 737-8 మ్యాక్స్‌ విమానాల్లో తనిఖీలు నిర్వహించాలని విమానయాన సంస్థలకు సూచించింది.

Published : 06 Jan 2024 22:24 IST

DGCA to Airlines | దిల్లీ: అలస్కా ఎయిర్‌లైన్స్‌ ఘటన నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) అప్రమత్తమైంది. బోయింగ్‌కు చెందిన 737-8 మ్యాక్స్‌ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్‌ విమాన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బోయింగ్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దేశంలో ఏ విమానయాన సంస్థ 737-9 విమానాలను వినియోగించడం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా 737-8 విమానాల్లో అత్యవసరంగా ఒకసారి తనిఖీలు చేపట్టాలి’’ అని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది.

గగనతలంలో ఊడిన డోర్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియో బయల్దేరిన అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డోర్‌ ఒక్కసారిగా ఊడింది. 16 వేల అడుగుల ఎత్తులో జరిగిన ఈ ఘటన అనంతరం విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. మరోవైపు బోయింగ్‌ 737-9 విమానాల సేవల్ని అలస్కా నిలిపివేసింది. దీంతో 65 విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు