Bharat Shakti: ఆకాశంలో యుద్ధ విమానాల గర్జన.. నేలపై సేనల పరాక్రమం

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించిన విన్యాసాల్లో త్రివిధ దళాలు తమ రక్షణ పరికరాల సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.

Published : 12 Mar 2024 23:10 IST

జైసల్మేర్‌: త్రివిధ దళాలు తమ యుద్ధ పాటవాలతో సత్తా చాటాయి. ‘భారత్ శక్తి (Bharat Shakti)’ పేరిట రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన విన్యాసాల్లో.. దేశీయంగా తయారుచేసిన రక్షణ పరికరాల సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆకాశంలో యుద్ధ విమానాల గర్జన, నేలపై సేనల పరాక్రమం.. సరికొత్త భారత్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) పేర్కొన్నారు. దేశ స్వావలంబన, విశ్వాసం, ఆత్మగౌరవాల సమ్మేళనానికి పోఖ్రాన్ సాక్షిగా నిలిచిందన్నారు.

భారత్‌ ‘అగ్ని’ పరీక్ష వేళ.. బంగాళాఖాతంలోనే డ్రాగన్‌ నిఘా నౌక..!

ఈ విన్యాసాల్లో భాగంగా ఎల్‌సీఏ తేజస్‌, ఏఎల్‌హెచ్‌ మార్క్‌-4 హెలికాప్టర్లు, ఆకాశ్‌ ఆయుధ వ్యవస్థ, మొబైల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌, బీఎంపీ-2 శకటం, అర్జున్‌, టీ-90 యుద్ధట్యాంకులు, పినాక రాకెట్‌ లాంచర్‌, సరకు రవాణా డ్రోన్లు, యాంటీషిప్‌ మిసైల్స్‌ వంటి అధునాతన ఆయుధ సంపత్తి శక్తిసామర్థ్యాలను ప్రదర్శించారు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ విన్యాసాలను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే తదితరులతోపాటు 30కు పైగా దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు తిలకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని