Mumbai police: సీబీఐ చీఫ్‌కి ముంబయి పోలీసుల సమన్లు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్‌, మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్‌కుమార్‌ జైశ్వాల్‌కి ముంబయి పోలీసులు సమన్లు జారీచేశారు.....

Updated : 10 Oct 2021 12:47 IST

ముంబయి: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్‌, మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్‌కుమార్‌ జైశ్వాల్‌కి ముంబయి పోలీసులు సమన్లు జారీచేశారు. ఫోన్‌ట్యాపింగ్‌, డేటా లీక్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో సైబర్‌ విభాగం పోలీసులు ఆయనకు సమన్లు పంపారు. ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని  ఈ-మెయిల్ ద్వారా సుబోధ్‌కుమార్‌ జైశ్వాల్‌కు సమన్లు పంపినట్టు పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్‌ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్‌ జరిగినట్లు, కావాలనే ఈ నివేదికను లీక్‌ చేశారన్న ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు. అప్పట్లో రష్మీశుక్లా మహారాష్ట్ర ఇంజెలిజెన్స్‌ విభాగం అధిపతిగా ఉండగా.. జైశ్వాల్‌ డీజీపీగా పనిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని