CJI: ప్లీజ్‌.. మాస్కులు పెట్టుకోండి.. లాయర్లకు సీజేఐ సూచన

సుప్రీంకోర్టులో పలువురు జడ్జిలు, సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో సీజేఐ (CJI) జస్టిస్ ఎన్‌.వి.రమణ (Justice N.V.Ramana) కీలక విజ్ఞప్తి చేశారు. .....

Updated : 11 Aug 2022 16:28 IST

దిల్లీ: సుప్రీంకోర్టులో పలువురు జడ్జిలు, సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో సీజేఐ (CJI) జస్టిస్ ఎన్‌.వి.రమణ (Justice N.V.Ramana) కీలక విజ్ఞప్తి చేశారు. కోర్టు రూమ్‌లలో న్యాయవాదులంతా మాస్కులు ధరించాలని సూచించారు. గురువారం కోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రారంభించడానికి ముందు సీజేఐ మాట్లాడుతూ.. ‘‘దయచేసి మాస్కులు పెట్టుకోండి. మన సిబ్బందితో పాటు జడ్జిలూ కరోనా బారినపడుతున్నారు. అందువల్ల కోర్టు రూమ్‌లలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించండి’’ అని కోరారు. దీనిపై స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ‘నాకు నెగెటివ్‌ వచ్చింది.. సీనియర్‌ అడ్వకేట్‌ ఎ.ఎం. సింఘ్వీకి కొవిడ్‌ పాజిటివ్’’ అని తెలపగా.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. 

హామీలు నెరవేర్చలేకపోతే పార్టీల గుర్తింపు రద్దు తగదు: సుప్రీంకోర్టు

మరోవైపు, ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై విచారణ సమయంలో సీజేఐ న్యాయవాదులంతా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత హమీలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలు నెరవేర్చలేకపోతే పార్టీల గుర్తింపు రద్దు తగదని.. అలా చేయాలనడం ప్రజాస్వామ్య వ్యతిరేకం అవుతుందని పేర్కొంది. ఇప్పటికే శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటుందన్న అపవాదు ఉందని సీజేఐ అన్నారు. ఉచితాలపై పార్టీలు ఇచ్చే హమీలకు సంబంధించిన పూర్తి వివరాలను ధర్మాసనం కోరింది. పూర్తి డేటా వచ్చాకే ఏమేరకు జోక్యం చేసుకోవచ్చన్నది పరిశీలిస్తామంది. సంక్షేమాన్ని, ఉచితాలను ఒకే గాటన కట్టరాదని.. వాటిని వేర్వేరుగా చూడాలని వ్యాఖ్యానించిన ధర్మాసనం..  ఉచితాలపై పార్టీ మేనిఫెస్టో వివరాలను కోర్టుకు అందజేయాలని సూచించింది. అనంతరం విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని