Monkeypox: దిల్లీలో మరో మంకీపాక్స్‌ కేసు వెలుగులోకి..!

దిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్‌ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లు అయింది. దిల్లీలో 31ఏళ్ల  వ్యక్తికి తాజాగా మంకీపాక్స్‌ నిర్ధారణ అయింది.

Updated : 24 Jul 2022 16:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్‌ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లయింది. 31ఏళ్ల  వ్యక్తికి తాజాగా మంకీపాక్స్‌ నిర్ధారణ అయింది. అతడు ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలింది. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.

గతంలో దేశంలో మంకీపాక్స్‌ బారిన పడిన ముగ్గురూ కేరళకు చెందినవారే. వీరు మధ్యప్రాశ్చ్యంలోని దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా కేసు దిల్లీలో బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా 16,000 మంది మంకీ పాక్స్‌ బారినపడ్డారు. ఈ వ్యాధి మొత్తం 75 దేశాలకు వ్యాపించింది. మరోవైపు మంకీపాక్స్‌ కేసులు పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా ఆరోగ్య అత్యవరసర పరిస్థితి విధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని