Anand Mahindra: ‘వీళ్లతో పెట్టుకోవద్దు..’: ఇతర దేశాల ఆర్మీకి మహీంద్రా సూచన

Anand Mahindra: గణతంత్ర వేడుకల్లో సైనిక కవాతుపై పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ఇతర దేశాల ఆర్మీకి ఓ సూచన చేశారు.

Updated : 27 Jan 2024 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్యపథ్‌లో శుక్రవారం జరిగిన పరేడ్‌ (Parade) ఆసాంతం ఆకట్టుకుంది. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra)స్పందిస్తూ మన అమేయ సైనిక (Indian Army) శక్తిని కొనియాడారు. ఈ సందర్భంగా శత్రు దేశాలను ఉద్దేశిస్తూ సున్నితంగా ఓ హెచ్చరిక కూడా చేశారు.

పరేడ్‌లో సైనిక కవాతు వీడియోను పోస్ట్‌ చేసిన ఆయన.. ‘‘ఇతర దేశాల సైన్యానికి నాదో వ్యక్తిగత సలహా. వీళ్లతో ఎప్పుడూ పెట్టుకోవద్దు’’ అని రాసుకొచ్చారు. మన సైన్యం శక్తి సామర్థ్యాలను ఉద్దేశిస్తూ ‘భారత్‌ దృఢంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా ఎమోజీలు జత చేశారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అటు నారి.. ఇటు సైనిక భేరి: దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర వేడుక

ఈసారి జరిగిన గణతంత్ర వేడుకల పరేడ్‌లో మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతో పాటు నాగ్‌ క్షిపణులు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, పినాక మల్టిపుల్‌ రాకెట్‌ వ్యవస్థ, వెపన్‌ లొకేషన్‌ రాడార్‌ వ్యవస్థలు, బీఎంపీ-2 సాయుధ శకటాలను ప్రదర్శించారు. ఇక, తొలిసారిగా పూర్తిస్థాయిలో త్రివిధ దళాలకు చెందిన నారీమణులు చేసిన కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని