ED raids: పవార్‌ మనవడి సంస్థలో ఈడీ సోదాలు

మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌(Sharad Pawar) మనవడికి చెందిన సంస్థలో ఈడీ తనిఖీలు చేపట్టింది.

Updated : 05 Jan 2024 15:23 IST

ముంబయి: ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar) కుటుంబానికి చెందిన సంస్థలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. పవార్‌ మనవడు రోహిత్ పవార్‌కు చెందిన బారామతి ఆగ్రో, అనుబంధ సంస్థల్లో తనిఖీలు జరిగాయి. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా.. బారామతి, పుణె, ఔరంగాబాద్‌, అమరావతితో సహా దాదాపు ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. రోహిత్ పవార్‌.. శరద్‌ పవార్‌(Sharad Pawar) సోదరుడి మనవడు.

కేజ్రీవాల్‌కు పవార్ మద్దతు..

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పలుమార్లు ఈడీ సమన్లు ఇచ్చిన నేపథ్యంలో..  శరద్‌ పవార్‌(Sharad Pawar) ఆయనకు మద్దతు పలికారు. విపక్షాలను అణచివేసేందుకు  దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఆప్ అధినేతను ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారన్నారు. ఇప్పటికే ఆప్‌ నేతలు జైల్లో ఉన్నారని, కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేసేందుకు చర్యలు ప్రారంభించారని దుయ్యబట్టారు. భాజపా.. హిట్లర్‌లా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని