Modi-Macron: మోదీకి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఫోన్‌ కాల్‌..

భారత ప్రధాని నరేంద్రమోదీతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారంపై వీరిద్దరూ

Published : 21 Sep 2021 22:41 IST

దిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారంపై వీరిద్దరూ చర్చించినట్లు మేక్రాన్‌ కార్యాలయం వెల్లడించింది. దీంతో పాటు అఫ్గానిస్థాన్‌లో సంక్షోభం, ఇతర అంశాలపై కూడా చర్చలు జరిపినట్లు పేర్కొంది. కాగా.. ఫ్రాన్స్‌తో చేసుకున్న జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ ఫోన్‌ కాల్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా ‘ఆకస్‌’ పేరుతో కొత్త త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌తో చేసుకున్న 100 బిలియన్‌ డాలర్ల విలువైన జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా.. అమెరికా సాంకేతికత పరిజ్ఞానంతో బ్రిటన్‌ నిర్మించిన అణుజలాంతర్గముల కొనుగోలుకు అంగీకరించింది. అయితే ఈ పరిణామాలపై ఫ్రాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా-బ్రిటన్‌- అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాన్ని వెన్నుపోటుగా అభివర్ణించిన ఫ్రాన్స్‌.. ఇందుకు నిరసనగా ఆ దేశాల్లోని తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని