‘నమస్తే ట్రంప్‌’లో ఇవాంక తళుకులు‌‌..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, యూఎస్‌ ప్రథమ మహిళ మెలానియాల భారత పర్యటనలో వారి కుమార్తె ఇవాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ట్రంప్‌కు మోదీ స్వాగతం పలికే సమయంలో ఆమె ధరించిన ఫ్లోరల్‌ డ్రెస్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

Published : 25 Feb 2020 00:47 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, యూఎస్‌ ప్రథమ మహిళ మెలానియాల భారత పర్యటనలో  ట్రంప్‌ కుమార్తె ఇవాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ట్రంప్‌కు మోదీ స్వాగతం పలికే సమయంలో ఆమె ధరించిన ఫ్లోరల్‌ డ్రెస్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రొయెంజా షోలర్‌ బ్రాండ్‌కు చెందిన ఈ డ్రస్‌.. బేబీ బ్లూ, రెడ్ కలర్‌ ఫ్లోరల్స్‌తో తయారైంది. ఇంతటి అద్భుతమైన వస్త్రధారణతో ఇవాంక ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో తళుక్కుమన్నారు. ఈ కార్యక్రమం కోసం మోతేరా స్టేడియానికి వచ్చిన సందర్శకులతో ఫొటోలకు పోజిస్తూ సందడి చేశారు. ఆమె ధరించిన ఆ డ్రెస్‌ విలువ రూ.1.71లక్షలు కావడం గమనార్హం. 

ఇవాంక ఈ ఫ్లోరల్‌ డ్రెస్‌ ధరించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబర్‌లో అర్జెంటినా పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె ఈ డ్రెస్‌ ధరించారు. ఇవాంక భారత పర్యటనకు రావడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని