వైద్యులకు అమిత్‌ షా భరోసా

కొవిడ్‌-19పై పోరులో ముందున్న వైద్య బృందాలు, ఇతర సిబ్బందిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశంసించారు. వైద్య సిబ్బందికి ఎటువంటి హాని జరగకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.....

Published : 22 Apr 2020 11:57 IST

దాడులు జరగకుండా రక్షణ కల్పిస్తామని హామీ

దిల్లీ: కొవిడ్‌-19పై పోరులో ముందున్న వైద్య బృందాలు, ఇతర సిబ్బందిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశంసించారు. వైద్య సిబ్బందికి ఎటువంటి హాని జరగకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈరోజు భారత వైద్య సంఘం(ఐఎంఏ) ప్రతినిధులు, వైద్య బృందాలతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌-19 రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులపై దాడి జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యులు నేడు దేశవ్యాప్త సింబాలిక్‌ ప్రొటెస్ట్కు పిలుపునిచ్చారు. దీంతో రంగంలోకి అమిత్‌ షా వారి సేవల్ని ప్రశంసించడంతో పాటు ఎలాంటి నిరసనలకు దిగొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వైద్యులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని