Crime News: పిల్లలు పుట్టడం లేదని.. మహిళతో శ్మశానంలో ఎముకలు తినిపించారు

పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళతో ఎముకలు తినిపించిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె, ధైరీ ప్రాంతంలోని సింహగడ్‌ రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Updated : 21 Jan 2023 10:03 IST

పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళతో ఎముకలు తినిపించిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె, ధైరీ ప్రాంతంలోని సింహగడ్‌ రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళకు సంతానం కలగలేదని భర్త సహా కుటుంబ సభ్యులు ఆమెను కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. ఆమెపై నరబలి, జంతుబలి చేసే మాంత్రికుడితో క్షుద్ర పూజలు చేయించారు. శ్మశానంలో ఆ మహిళను కూర్చోబెట్టి ఆమె చేత అస్థికలు తినిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పుణెకు చెందిన భర్త, అత్తమామలు సహా 8 మందిపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై మహారాష్ట్ర మహిళ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రూపాలీ చకంకర్‌ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని