సామాజిక మాధ్యమాలపై ఫిర్యాదుల పరిశీలనకు 3 ప్రత్యేక కమిటీలు

సామాజిక మాధ్యమాలు, ఇతర ఇంటర్నెట్‌ ఆధారిత వేదికల్లోని సమాచారం, ఇతర అంశాలపై వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు కేంద ప్రభుత్వం మూడు గ్రివాన్సెస్‌ అప్పిలేట్‌ కమిటీ(జీఏసీ)లను ఏర్పాటుచేసింది.

Published : 28 Jan 2023 05:05 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాలు, ఇతర ఇంటర్నెట్‌ ఆధారిత వేదికల్లోని సమాచారం, ఇతర అంశాలపై వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు కేంద ప్రభుత్వం మూడు గ్రివాన్సెస్‌ అప్పిలేట్‌ కమిటీ(జీఏసీ)లను ఏర్పాటుచేసింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతి కమిటీలో ఒక ఛైర్‌పర్సన్‌, వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఇద్దరు పూర్తికాల సభ్యులు, పరిశ్రమకు సంబంధించిన విశ్రాంత సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఉంటారని, వీరి పదవీకాలం మూడేళ్లని పేర్కొంది. ఫిర్యాదులపై తొలుత ఆయా సామాజిక మాధ్యమాలు చేపట్టిన చర్యలపై వినియోగదారులు సంతృప్తి చెందకపోతే ఈ కమిటీలను సంప్రదించవచ్చు.
నోటిఫికేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం కమిటీల స్వరూపం ఇలా..

తొలి కమిటీ అధ్యక్షుడు: కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని భారత సైబర్‌ నేరాల నిరోధక సమన్వయ కేంద్రం సీఈఓ

సభ్యులు: విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అశుతోష్‌ శుక్లా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మాజీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ సునీల్‌ సోని.

రెండో కమిటీ అధ్యక్షుడు: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పాలసీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఇంఛార్జి జాయింట్‌ సెక్రటరీ

సభ్యులు: ఇండియన్‌ నేవీ రిటైర్డ్‌ కమొడొర్‌ సునీల్‌ కుమార్‌ గుప్త, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ మాజీ ఉపాధ్యక్షుడు కవీంద్ర శర్మ.

మూడో కమిటీ అధ్యక్షుడు: కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖలో సీనియర్‌ సైంటిస్ట్‌ కవితా భాటియా

సభ్యులు: భారతీయ రైల్వే మాజీ ట్రాఫిక్‌ సర్వీస్‌ అధికారి సంజయ్‌ గోయెల్‌, ఐడీబీఐ ఇంటెక్‌ మాజీ ఎండీ, సీఈఓ క్రిష్ణగిరి రఘోత్తమరావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని