కొవిడ్‌ వ్యాక్సిన్లతో రోగనిరోధక శక్తి వృద్ధి

దేశీయంగా ప్రజలకు అందించిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లతో మంచి రోగనిరోధక శక్తి వృద్ధి చెందినట్లు అధ్యయనాల్లో తేలిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు.

Published : 04 Feb 2023 04:07 IST

కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశీయంగా ప్రజలకు అందించిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లతో మంచి రోగనిరోధక శక్తి వృద్ధి చెందినట్లు అధ్యయనాల్లో తేలిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల సామర్థ్యం, వాటివల్ల ఎదురయ్యే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఏదైనా అధ్యయనం చేయాలనుకుంటోందా? అని భారాస లోక్‌సభాపక్ష నేత నామానాగేశ్వరరావు శుక్రవారం లోక్‌సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ‘‘ఐసీఎంఆర్‌ 2021 మే, జులై నెలల్లో కొవిడ్‌ వ్యాక్సిన్లపై వివిధ కేంద్రాలు, విభిన్న ఆసుపత్రుల్లో కేస్‌ కంట్రోల్‌ స్టడీ నిర్వహించింది. వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత కొవిషీల్డ్‌ 85%, కొవాగ్జిన్‌ 71% సామర్థ్యాన్ని చూపుతున్నట్లు అందులో తేలింది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని