బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో దాచి.. బస్సులో ప్రయాణం

అయిదు నెలల కుమారుడి మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఓ తండ్రి నిస్సహాయ పరిస్థితిలో బస్సులో పయనమయ్యాడు.

Published : 16 May 2023 04:18 IST

యిదు నెలల కుమారుడి మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఓ తండ్రి నిస్సహాయ పరిస్థితిలో బస్సులో పయనమయ్యాడు. మృతదేహాన్ని బ్యాగులో దాచుకుని 200 కి.మీ.ప్రయాణించాడు. ఈ హృదయవిదారక ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లాకు చెందిన అసిమ్‌ దేవశర్మ కవల పిల్లలిద్దరూ అనారోగ్యానికి గురవడంతో శిలిగుడిలోని ఉత్తర బెంగాల్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కవలల్లో ఒకరి ఆరోగ్యం కాస్త మెరుగుపడగా.. మరో కుమారుడు శనివారం రాత్రి మృతిచెందాడు. బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు డ్రైవర్లు రూ.8వేలు డిమాండ్‌ చేశారు. అతడి దగ్గర అంత డబ్బు లేదు. దీంతో చేసేదేం లేక చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచి బస్సులో ప్రయాణించాడు. కలియాగంజ్‌ చేరుకున్నాక.. కొందరి సాయంతో అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్లాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు