రైలు ప్రమాద మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతి చెందిన తమ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
బెంగాలీలకు సీఎం మమత హామీ
కోల్‌కతా: ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతి చెందిన తమ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాల్లోనూ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. సోమవారం కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. తీవ్ర గాయాలపాలై బాధపడుతున్న వారికి నగదు సాయం అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని, ఒడిశాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారంతా కటక్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మంగళవారం వారిని పరామర్శించడానికి వెళ్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kumari Srimathi Review: రివ్యూ: కుమారి శ్రీమతి.. నిత్యామేనన్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
-
JioFiber: జియో ఫైబర్ ఆఫర్.. 30 రోజులు ఉచిత సర్వీస్
-
Girlfriend effect: కొత్త ట్రెండ్.. #గర్ల్‌ఫ్రెండ్ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటిది?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
Janhvi Kapoor: అశ్లీల వెబ్‌సైట్స్‌లో నా ఫొటోలు చూసి షాకయ్యా: జాన్వీకపూర్