సొలిసిటర్‌ జనరల్‌గా తుషార్‌ మెహతా పదవీకాలం పొడిగింపు

సీనియర్‌ న్యాయవాది తుషార్‌ మెహతా సొలిసిటర్‌ జనరల్‌(ఎస్జీ)గా మరో మూడేళ్లు కొనసాగనున్నారు. శుక్రవారం ఆయనను పునర్నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 01 Jul 2023 04:30 IST

దిల్లీ: సీనియర్‌ న్యాయవాది తుషార్‌ మెహతా సొలిసిటర్‌ జనరల్‌(ఎస్జీ)గా మరో మూడేళ్లు కొనసాగనున్నారు. శుక్రవారం ఆయనను పునర్నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీగా మెహతా 2018 అక్టోబర్‌ 10న నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన పదవీకాలాన్ని రెండుసార్లు కేంద్రం పొడిగించింది. మెహతాతో పాటు.. అదనపు సొలిసిటర్‌ జనరళ్లు(ఏఎస్జీ)గా ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయాధికారులు విక్రమ్‌జీత్‌ బెనర్జీ, కె.ఎం.నటరాజ్‌, బల్బీర్‌సింగ్‌, ఎస్‌.వి.రాజు, ఎన్‌.వెంకట్రామణ్‌, ఐశ్వర్యబాటీని కూడా కేంద్రం తిరిగి నియమించింది. వీరు కూడా ఏఎస్జీలుగా మూడేళ్లు కొనసాగుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు