సంప్రదాయ ఔషధాలకు భారత్‌ మూలం

ఆయుర్వేదం, యోగా వంటి భారతీయ సంప్రదాయ ఔషధ విధానానికి గొప్ప చరిత్ర ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ గెబ్రెయేసస్‌ ప్రశంసించారు.

Published : 18 Aug 2023 04:59 IST

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ డా.టెడ్రోస్‌

గాంధీనగర్‌: ఆయుర్వేదం, యోగా వంటి భారతీయ సంప్రదాయ ఔషధ విధానానికి గొప్ప చరిత్ర ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ గెబ్రెయేసస్‌ ప్రశంసించారు. ఈ పురాతన ఔషధ పరిజ్ఞానాన్ని ఇతర దేశాల్లోని జాతీయ ఆరోగ్యవిధానాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జీ20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో భాగంగా గురువారం గుజరాత్‌లోని గాంధీనగర్‌ మహాత్మా మందిర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సంప్రదాయ ఔషధంపై డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో మొదటి గ్లోబల్‌ సదస్సు  ప్రారంభమైంది. ఈ సందర్భంగా టెడ్రోస్‌ మాట్లాడుతూ.. నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో భారతీయ సంప్రదాయ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. సంప్రదాయ మందులను జాతీయ ఆరోగ్య విధానాల్లో చేర్చడం ‘గుజరాత్‌ డిక్లరేషన్‌’ ప్రధాన లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉద్దేశించిన పథకాలన్నింటినీ భారతదేశం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకురావడాన్ని డా.టెడ్రోస్‌ ప్రశంసించారు. గాంధీనగర్‌లోని ఆయుష్మాన్‌ భారత్‌ వెల్‌నెస్‌ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని