జడ్జీల పోస్టుల్లోనూ మహిళలకు 33 శాతం ఇవ్వండి

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో... ఉన్నత న్యాయస్థానాల్లోని జడ్జీల పోస్టులకూ ఈ కోటాను వర్తింపజేయాలని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) మాజీ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు.

Published : 24 Sep 2023 04:37 IST

సీజేఐకి ఎస్‌సీబీఏ మాజీ అధ్యక్షుడి లేఖ

దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో... ఉన్నత న్యాయస్థానాల్లోని జడ్జీల పోస్టులకూ ఈ కోటాను వర్తింపజేయాలని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) మాజీ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాశారు. పట్నా, ఉత్తరాఖండ్‌, త్రిపుర, మేఘాలయ, మణిపుర్‌ హైకోర్టులలో ప్రస్తుతం ఒక్క మహిళా జడ్జీ కూడా లేరని తెలిపారు. దేశంలో మిగిలిన 20 హైకోర్టులలో న్యాయమూర్తులుగా 670 మంది పురుషులు ఉంటే, మహిళా జడ్జీల సంఖ్య 103 మాత్రమేనని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని