గ్యాలరీల్లో నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోండి

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సందర్శకుల గ్యాలరీల్లో కూర్చుని నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు తృణమూల్‌, శివసేన ఎంపీలు మౌసం నూర్‌, ప్రియాంక చతుర్వేది లేఖలు రాశారు.

Published : 24 Sep 2023 04:37 IST

రాజ్యసభ ఛైర్మన్‌కు ఎంపీల లేఖలు

దిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సందర్శకుల గ్యాలరీల్లో కూర్చుని నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు తృణమూల్‌, శివసేన ఎంపీలు మౌసం నూర్‌, ప్రియాంక చతుర్వేది లేఖలు రాశారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ రాజకీయ నినాదాలు చేయడం విస్మయపరిచిందని వారు పేర్కొన్నారు. దాదాపు 50 మంది నినాదాలు చేశారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మిగిలిన పార్టీలూ ఈ విషయమై లేఖలు రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని