మణిపుర్‌లో ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణ: బీరెన్‌

మణిపుర్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తెలిపారు.

Published : 24 Sep 2023 05:36 IST

ఇంఫాల్‌: మణిపుర్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తెలిపారు. ‘‘నకిలీ వార్తల ప్రచారం, ద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తిని నిరోధించడానికి మే 3వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడడం వల్ల శనివారం నుంచి ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరిస్తున్నాం’’ అని బీరెన్‌ సింగ్‌ తెలిపారు. భారత్‌- మయన్మార్‌ సరిహద్దులో కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు. మణిపుర్‌ సరిహద్దులో 60 కిలోమీటర్ల మేర కంచె వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందని సీఎం బీరెన్‌ సింగ్‌ చెప్పారు. 15 రోజుల్లోగా అక్రమ ఆయుధాలను అప్పగించాలని లేదంటే భద్రతా దళాలు తీసుకునే చర్యలను ఎదుర్కోవాలని మణిపుర్‌ ప్రభుత్వం.. ప్రజలకు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని