నా ప్రార్థన వల్లే కుమారుడికి కొత్త అవకాశం

తన ప్రార్థనల వల్లే కుమారుడు అనిల్‌కు రాజకీయాల్లో కొత్త అవకాశం లభించిందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్‌ సమర్థించుకొంటున్న వీడియో కేరళలో కలకలం సృష్టిస్తోంది.

Published : 24 Sep 2023 05:36 IST

ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్‌

తిరువనంతపురం: తన ప్రార్థనల వల్లే కుమారుడు అనిల్‌కు రాజకీయాల్లో కొత్త అవకాశం లభించిందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్‌ సమర్థించుకొంటున్న వీడియో కేరళలో కలకలం సృష్టిస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహితుడైన ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఇది ఆంటోనీకి దిగ్భ్రాంతి కలిగించింది. భాజపాలో చేరవలసిందిగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు అనిల్‌ తనకు ముందే చెప్పినా, ఆ విషయం తాను బయటపెట్టలేదని ఆయన తల్లి ఎలిజబెత్‌ వెల్లడించారు. అసలు తన ప్రార్థనల వల్లే భర్త ఆంటోనీకి కాంగ్రెస్‌ కార్యవర్గంలో సభ్యత్వం లభించిందని, అనిల్‌ చర్యతో కుటుంబంలో తలెత్తిన విభేదాలూ సమసిపోయాయని ఆమె తెలిపారు. తనకు మొదట్లో భాజపా అంటే తిరస్కార భావం ఉన్నా ప్రార్థనల వల్ల తన మనసు మారిందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని